28th May 2026

___________

- Saidulu

హోటల్ స్టైల్ సాఫ్ట్ అట్లు కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

అట్లు మెత్తగా, దూదిలా రావాలంటే పిండి తయారీ చాలా ముఖ్యం. సరైన నిష్పత్తిలో పదార్థాలు వేసి పిండి ఫెర్మెంట్ చేస్తే అట్లు రుచిగా, సాఫ్ట్‌గా వస్తాయి.

బియ్యం ,మినప్పప్పు సరైన మోతాదులో ఉండాలి. సాధారణంగా 3 కప్పుల బియ్యానికి 1 కప్పు మినప్పప్పు వేస్తే మంచి టెక్స్చర్ వస్తుంది.

కొద్దిగా అటుకులు లేదా ఉడికించిన అన్నం కలిపితే అట్లు మరింత మెత్తగా వస్తాయి. ఇవి పిండికి నాజూకైన టెక్స్చర్ ఇస్తాయి.

మినప్పప్పును బాగా నురగ వచ్చేలా గ్రైండ్ చేయాలి. ఇలా చేస్తే పిండిలో గాలి చేరి అట్లు దూదిలా వస్తాయి.

పిండిని కనీసం 8 గంటలు ఫెర్మెంట్ చేయడం చాలా ముఖ్యం. ఫెర్మెంటేషన్ బాగా జరిగితే అట్లు రుచిగా ఉంటాయి.

ఉప్పు సరైన సమయంలో వేయాలి. ముందే ఉప్పు వేస్తే పిండి త్వరగా పులిసే అవకాశం ఉంటుంది.

పిండి చాలా గట్టిగా లేదా పల్చగా ఉండకూడదు. మధ్యస్థంగా ఉంటే అట్లు సాఫ్ట్‌గా, సమంగా కాలుతాయి.

అట్లు వేయించే పెనం బాగా వేడిగా ఉండాలి. కానీ ఎక్కువ మంటపై వేస్తే అట్లు గట్టిగా మారిపోతాయి.

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లో చేసిన అట్లు హోటల్ స్టైల్‌లో మెత్తగా, రుచిగా వస్తాయి.