జూన్ 19, 20 తేదీల్లో మటా రెండో మహాసభలు.. ప్రత్యేక ఆకర్షణగా ‘సింగింగ్ స్టార్’ పోటీలు
MATA: మన అమెరికా తెలుగు సంఘం (MATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “మటా 2వ కన్వెన్షన్ ’26” (MATA 2nd CONVENTION ’26) మహాసభల సందర్భంగా సంగీత ప్రియుల కోసం ‘మటా సింగింగ్ స్టార్’ (MATA Singing Star) పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలకు ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ , ఎల్ఎమ్ఏ (LMA) – బాలగంధర్వం వ్యవస్థాపకులు డాక్టర్ రామాచారి కొమండూరి అడ్వైజర్ , మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.
విభాగాలు..
క్లాసికల్ , నాన్-క్లాసికల్ (Classical / Non-Classical) విభాగాలలో జరుగుతున్న ఈ పోటీలకు రిజిస్ట్రేషన్ ఫీజుగా $20 నిర్ణయించారు. ఈ పోటీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ముగిశాయి (Registrations Closed).
పోటీల వివరాలు..
ఆడిషన్స్ / ప్రిలిమ్స్: ఆన్లైన్ (Online) పద్ధతిలో నిర్వహిస్తారు.
సెమీస్ & గ్రాండ్ ఫినాలే: కన్వెన్షన్ వేదికపై నేరుగా (In Person @ Convention) నిర్వహిస్తారు. ఫైనలిస్టులు అందరూ కన్వెన్షన్‌లో ప్రదర్శన ఇస్తారు.
వయస్సు వర్గీకరణ: సబ్-జూనియర్స్ (6-11 సంవత్సరాలు), జూనియర్స్ (12-18 సంవత్సరాలు), అడల్ట్స్ (19 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ).
ఈ పోటీల నిర్వహణ కోసం హరి కృష్ణ మహర్షి చైర్మన్‌గా, చైతు మద్దురి, రంగ మడిశెట్టి, శ్రీలక్ష్మి లక్కిశెట్టి, ఉష రామక కో-చైర్మన్లుగా ‘మటా సింగింగ్ స్టార్ కమిటీ’ పర్యవేక్షిస్తోంది.
ఈ ప్రధాన మహాసభలు 2026 జూన్ 19 నుండి జూన్ 20 వరకు పెన్సిల్వేనియాలోని ‘ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్’ (The Greater Philadelphia Expo Center) లో వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ‘xpat.money’ , ‘MSNO REALTY’ సంస్థలు మెగా స్పాన్సర్లుగా వ్యవహరిస్తుండగా, ‘ఓంకార్ డివైన్ కల్చరల్ సెంటర్’ గ్రాండ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. మటా ప్రెసిడెంట్ రమణ కిరణ్ దుద్దగి, కన్వీనర్ శ్రీధర్ గూడల నేతృత్వంలోని మటా కోర్ కమిటీ ఈ వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది.







