డీబీవీ స్వామి కామెంట్స్‌తో పార్టీలో హీట్.. కార్యకర్తలకు ఎందుకింత అర్జెన్సీ?
ఎన్టీఆర్ (NTR) సినిమా రంగంలో మకుటంలేని మహారాజుగా వెలుగొందారని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి (Dola Sri Bala Veeranjaneya Swamy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా రంగంలో తెలుగు ప్రజలు చూపించిన ఆదరణకు, వారి రుణం తీర్చుకోవాలనే ఆశయంతోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)ని స్థాపించారని గుర్తు చేశారు. 43 ఏళ్ల క్రితమే పేదల ఆహార భద్రత గురించి ఆలోచించి రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తెచ్చిన దార్శనికుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. జనతా వస్త్రాల పంపిణీతోపాటు డీబీవీ స్వామి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పేదల కోసం పక్కా ఇళ్ల పథకాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారని వెల్లడించారు. రాయలసీమ (Rayalaseema) కరువు వచ్చినా, దివిసీమ ఉప్పెన వచ్చినా, స్వయంగా జోలె పట్టి విరాళాలు సేకరించి సామాజిక సేవలో ముందున్నారని తెలిపారు.
ప్రజలకు అధికారాన్ని మరింత చేరువ చేయడానికి పటేల్ , పట్వారీ, మునసబు వ్యవస్థలను రద్దు చేసి, మండల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. విద్యావంతులు, యువత, సామాన్య ప్రజలకు రాజకీయాల్లో అధికారం పీఠం దక్కేలా చేసిన గొప్ప సంస్కరణవాది ఎన్టీఆర్ అని ప్రశంసించారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటితే, చంద్రబాబు (Chandrababu) తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి ప్రపంచ నలుమÖలాల ఎదిగేలా చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 ఏళ్లయినా, కార్యకర్తల్లో అదే ఉత్సాహం, నాయకుల్లో అదే కొత్తదనం కనిపిస్తోందన్నారు. ఒక ప్రభుత్వం నిరంతరాయంగా అధికారంలో ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతాయన్నారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండాలని తెలిపారు. అందుకోసం కార్యకర్తలంతా కృషి చేయాలని అన్నారు.
ఇవి కూడా చదవండి







