విజయ్ ప్రాజెక్ట్‌కు భారీ ట్విస్ట్.. కొత్త బ్యానర్ ఎంట్రీ
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు డైరెక్టర్ రవికిరణ్ కోలా(Ravikiran Kola) తెరకెక్కిస్తున్న రౌడీ జనార్ధన్(Rowdy Janardhan), మరోవైపు రాహుల్ సంకృత్యాన్(Rahul Sankrityan) దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి(Ranabaali) సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ఈ రెండు సినిమాలను ప్రముఖ నిర్మాణ సంస్థలు దిల్ రాజు(Dil Raju) బ్యానర్ మరియు మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టులపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమాల నుంచి మరిన్ని అప్డేట్లు రానున్నాయని సమాచారం.
ఇవి కూడా చదవండి
ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మనం(Manam), 24 వంటి విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విక్రమ్ కె. కుమార్(Vikram K Kumar)తో విజయ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాను యూవీ క్రియేషన్స్(UV Creations) నిర్మించనున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా పరిస్థితులు మారుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది.
తాజాగా విజయ్ దేవరకొండ, విక్రమ్ కుమార్ ఇద్దరూ బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్(Maddock films) కార్యాలయంలో కనిపించడం ఆసక్తిని పెంచింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మించబోతుందా? లేక బాలీవుడ్ మార్కెట్‌పై విజయ్ ప్రత్యేక దృష్టి పెట్టాడా? అన్న చర్చలు జోరందుకున్నాయి. అయితే ఈ అంశాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.







