కొత్త సినిమా.. కానీ డేంజరస్ వైబ్స్! “ఒక్క అడుగు” ఫస్ట్ లుక్ వైరల్
సిరి క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ మోడల్ రచనా దర్శకత్వంలో తానే కథానాయకుడిగా నటిస్తూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “ఒక్క అడుగు”. సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ చేయగా రాఘవేందర్ ఎడిటింగ్ చేస్తున్నాను. సినీ ప్రముఖులు విఎన్ ఆదిత్య, అశోక్ కుమార్, సముద్ర, పద్మిని నాగులపల్లి, రామ సత్యనారాయణ, సత్య మాస్టర్ చేతుల మీదగా ఈ చిత్ర టైటిల్ & ఫస్ట్ లుక్ “ఒక్క అడుగు” లాంచ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నటుడు మురళి గారు మాట్లాడుతూ… “అందరికి నమస్కారం. ఒక టీచర్ గా దర్శకుడు శేఖర్ గారికి ఉన్న కమాండ్ చాలా ఆశ్చర్య పరిచింది. ఈ సినిమాతో ఆయనకు ఎంతో సహకరించాలి అనుకున్నాము కాని ఆయన కూడా అలాగే ఆయన ఆలోచనతో ముందుకు వచ్చారు” అన్నారు.
సత్య మాస్టర్ గారు మాట్లాడుతూ… “ఎటువంటి సినిమాకి అయిన పెద్ద వారి ఆశీర్వాదం ఉండాలి. ఈ సినిమాకు వచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. శేఖర్ మోడల్ మా స్టూడియోలో ఒక భాగం కావడం చాలా సంతోషం. కొత్త వారిని ప్రోత్సహించాలని ఆయన ముందుకు వచ్చారు. ఒక్క అడుగుతో ఆయన ద్వారా అందరికీ మంచి పేరు రావాలని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రభాస్ గారి డైలాగ్ ఎంతో ఫేమస్, అలాగే ఈ సినిమా కూడా ఫేమస్ గా మారి అందరిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ఇవి కూడా చదవండి
ఎంవి రఘు గారు మాట్లాడుతూ… “ఈ ఒక్క అడుగు సినిమాకు అన్ని విధాలుగా మంచి జరగాలని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.
నిర్మాత పద్మిని నాగులపల్లి గారు మాట్లాడుతూ… “ఒక సినిమాకు రచయితగా, దర్శక నిర్మాతగా, నటుడిగా రానున్న శేఖర్ మోడల్ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. కథ కొత్తగా ఉంటే కచ్చితంగా హిట్ అవుతుంది. ఈ ఒక్క అడుగు శేఖర్ జీవితంలో ముందు అడుగు కావాలని కోరుతున్నాను” అన్నారు.
ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ… “ఒక వ్యక్తి సినిమా చేయడానికి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అటువంటిది ఒక సినిమాకు అన్ని తానై ఒక్క అడుగు సినిమాను చేయడం చాలా పెద్ద విషయం. శేఖర్ గారికి, ఈ సినిమాకు ఆల్ ది బెస్ట్. ఒక సినిమాకు కంటెంట్ చాలా కీలక విషయం. ప్రేక్షకులను థియేటర్ కు తీసుకుని వచ్చేది కంటెంట్. ఈ సినిమాలో అటువంటి కంటెంట్ ఉంది అని నమ్ముతున్నాను” అన్నారు.
దర్శకుడు సముద్ర గారు మాట్లాడుతూ… “ఒక్క అడుగు చిత్ర టైటిల్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ ఒక్క అడుగు అనే టైటిల్ ఒకప్పుడు కృష్ణంరాజు గారు చేద్దాం అనుకున్నారు. అటువంటి గొప్ప టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు మంచి జరగాలని, పెద్ద హిట్ కావాలని కోరుతున్నాను” అన్నారు.
దర్శక మండలి ప్రెసిడెంట్ విఎన్ ఆదిత్య గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమంలో నాకు చాలా ఇష్టమైన వ్యక్తులతో స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒక్క అడుగు సినిమాతో నటుడు, నిర్మాత, దర్శకుడు అనే మూడు అడుగులు వేశారు. తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన సినీ ప్రకారం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా. కంటెంట్ ప్రేక్షకులలోకి వెళ్ళి మంచి విజయం సాధించి, నిర్మాతగా కూడా లాభాలు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
డాక్టర్ కిరణ్ గారు మాట్లాడుతూ… “ఈ స్టేజ్ పై ఉన్న అందరితో ఏదో ఒక విధంగా మంచి అనుబంధం ఉంది, దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. శేఖర్ మోడల్ గారు మల్టీ టాలెంటెడ్. ఆయనకు ప్రొడక్షన్ మీద మంచి అవగాహన ఉంది. ఒక్క అడుగు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.
నటుడు, దర్శక నిర్మాత శేఖర్ మోడల్ గారు మాట్లాడుతూ… “మా ఒక్క అడుగు చిత్ర టైటిల్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన అతిథులు, మహారధులు అందరికీ నా పాదాభివందనం. ఈ పరిశ్రమ చాలా పద్ధతిగా వ్యవహరించే పరిశ్రమ. నాకు నేనే ఒక అవకాశం కలిపించుకుంటూ ఒక్క అడుగు సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా కోసం నేను అన్ని రంగాలలో అవగాహన పెంచుకుని ఈ సినిమా చేశాను. దేవకట్ట గారితో పని చేశాను. సినిమా కోసం చాలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేశాను. చిత్ర పరిశ్రమలో పెద్దల ఆశీర్వాదం చాలా అవసరం. ఈ కార్యక్రమానికి అతిధులుగా వచ్చిన అందరితో వ్యక్తిగతంగా నాకు ఒక అనుబంధం ఉంది, వారంతా నాకు ప్రేరణను ఇచ్చిన వారే. వారంతా నాకు ఎంతో చేశారు. వేదిక మీద ఉన్న కొంత మందితో కలిసి నేను పని చేయడం జరిగింది. ఒక సినిమా చేయడం సులభమే కాని విజయవంతమైన సినిమా చేయడం, ఆ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకుని వెళ్ళడం కష్టం. ప్రస్తుత పరిస్థితులలో సినిమాలలో అవకాశం రావడం కష్టంగా ఉంది. ఈ సినిమా కోసం నేను ఆడిషన్ చేసి టాలెంట్ ఉన్న వారితో ఈ సినిమాతో ముందుకు వెళ్ళబోతున్నాను. మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థాంక్స్. మా సినిమాను అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.
ఇవి కూడా చదవండి







