తెలుగు గర్వం ఎన్టీఆర్.. భారత రత్న ఇవ్వాలన్న చంద్రబాబు
ఎన్టీఆర్ ఆశయాలకు అంకితమైన భావితరాలకు వాటిని అందించడం అందరి బాధ్యత అని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu ) అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగానే లోకేశ్ (Lokesh), మహిళలకు 33 శాతం సీట్లు ప్రకటన చేశారని తెలిపారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికీ ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ కు భారతరత్న (Bharat Ratna) ఇవ్వాలనేది ప్రజలందరి డిమాండ్ అని అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో చిరస్థాయినగా నిలిచిపోయే మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన చేసిన పాత్రలు వేయాలంటే మళ్లీ ఆయన పుట్టాలి తప్ప ఇతరులకు అసాధ్యమన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేజిక్కించుకోవటం చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాలేదని తెలిపారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని పార్టీకి, ఎన్టీఆర్ ఇచ్చిన సిద్ధాంతం శాశ్వతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. దేశానికి, రాష్ట్రానికి విశేష సేవలందించిన ఎన్టీఆర్ కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడు (Mahanadu) వేదిక ఏకగ్రీవం తీర్మానం చేసింది.
ఇవి కూడా చదవండి







