మిడిల్ ఈస్ట్‌లో భారీ ఉద్రిక్తత.. ఆకాశాన్ని చీల్చిన క్షిపణులు!
పశ్చిమాసియా మరోసారి రణరంగమైంది. చర్చలకు ఇరాన్ అంగీకరించకపోవడంతో.. ఇప్పటికే అమెరికా హర్మూజ్ పరిసరాల్లో దాడులు చేసింది. దీంతో ఇరాన్ రెచ్చిపోయింది. హర్మూజ్ సమీపంలో అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది.
హర్మూజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఇది జరిగిన కాసేపటికే బందర్ అబ్బాస్ పోర్టు వద్ద కూడా పలుమార్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ దాడులను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) దురాక్రమణ చర్యగా అభివర్ణించింది. అమెరికా పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని ఇరాన్ ఆరోపించింది. ఇలాంటి దురాక్రమణలు కొనసాగితే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
అంతేగాక, తాజా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్‌లను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్జీసీ తెలిపింది. మరోవైపు… తమ గగనతలంపైకి క్షిపణులు, డ్రోన్లు దూసుకొచ్చాయని కువైట్ (Kuwait) దళాలు పేర్కొన్నాయి. వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి







