కొత్త బీట్తో రాబోతున్న అనిల్ రావిపూడి సినిమా
కామెడీ ఎంటర్టైనర్స్కు తనదైన బ్రాండ్‌ను సెట్ చేసుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఇప్పుడు మరోసారి కొత్త మ్యూజికల్ ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టు టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు తొమ్మిది సినిమాలు తెరకెక్కించిన అనిల్ రావిపూడి ఒక్క సినిమాకూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచలేదు. అయితే ప్రతి సినిమాలో వినోదాన్ని కొత్తగా ప్రెజెంట్ చేయడం ఆయనకు పెద్ద సవాలే. అందుకే కథ, పాత్రలతో పాటు సంగీతం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వస్తున్నారు. కమర్షియల్ సినిమాలకు బలమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మాస్ బీట్స్ ఎంత కీలకమో బాగా అర్థం చేసుకున్న దర్శకుల్లో అనిల్ ఒకరు.
ఇవి కూడా చదవండి
ఇప్పటివరకు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad), తమన్(S. Thaman), భీమ్స్ సిసిరోలియో(Bheems Ceciroleo) వంటి కమర్షియల్ సౌండ్‌కు పేరున్న సంగీత దర్శకులతో కలిసి పని చేసిన అనిల్, ఇప్పుడు కొత్తగా జీవీ ప్రకాష్ కుమార్(G. V. Prakash Kumar) వైపు అడుగులు వేయడం ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా భీమ్స్‌తో చేసిన గత రెండు సినిమాలు సంగీతపరంగా మంచి రెస్పాన్స్ అందుకున్నప్పటికీ, ఈసారి సినిమా టోన్‌ను పూర్తిగా ఫ్రెష్‌గా వినిపించాలనే ఆలోచనతో జీవీ ప్రకాష్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. మెలోడీ, ఎమోషన్, ఆధునిక సౌండ్ డిజైన్ కలయిక జీవీ ప్రత్యేకత కావడంతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ కొత్త మల్టీస్టారర్‌లో వెంకటేష్ దగ్గుబాటి(Venkatesh Daggubati), నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, హీరోయిన్లుగా కీర్తి సురేష్(Keerthy Suresh), కృతి శెట్టి(Krithi Shetty) కనిపించనున్నారు. జూలైలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పాటు కొత్త తరహా మ్యూజికల్ ఫీల్‌ను అందించే సినిమాగా ఇది నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి







