తెలంగాణలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) జన్మదిన వేడుకలు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ (NTR Bhavan) లో ఘనంగా నిర్వహిచారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి (Nannuri Narsireddy) అధ్యక్షత వహించారు. చంద్రబాబునాయుడి 76 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేసి, డ్రోన్ల ద్వారా పూలవర్షం కురిపించారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు (Bakkani Narsimhulu), అరవిందకుమార్ గౌడ్ తదితర నేతలు పాల్గొని 76 కిలోల కేక్ కోశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని అత్యధిక సంవత్సరాలు పరిపాలించిన సీఎంగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. తెలంగాణ మొత్తం ఆదాయంలో 70 శాతం హైదరాబాద్, రంగారెడ్డి, జిల్లాల నుంచే వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఆనాడు చంద్రబాబు వేసిన అభివృద్ధి పునాదులే అని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});







