బాలయ్య ఫ్యాన్స్ కు ఈ సారి డబుల్ ధమాకా
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) పుట్టినరోజు దగ్గర పడటంతో అభిమానుల్లో ఇప్పటికే భారీ ఉత్సాహం నెలకొంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బాలయ్య(Balayya) సినిమాలకు సంబంధించిన ప్రత్యేక ప్రకటనలు వస్తాయని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి పరిస్థితి మరింత ప్రత్యేకంగా మారింది. ఒకేసారి రెండు క్రేజీ ప్రాజెక్టుల నుంచి అప్డేట్లు రానుండటంతో సోషల్ మీడియాలో ఇప్పటినుంచే చర్చ మొదలైంది. జూన్ 10ను టార్గెట్ చేస్తూ మేకర్స్ భారీ ప్లానింగ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand Malineni) కాంబినేషన్లో తెరకెక్కుతున్న #NBK111 షూటింగ్ దశలో ఉంది. గతంలో వచ్చిన భారీ విజయంతో ఈ జోడీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్, ఎమోషన్ మేళవింపుతో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. ఇటీవల నటుడు మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలో కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి మాస్ గ్లింప్స్ రిలీజ్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అభిమానులకు ఇది ప్రత్యేక ట్రీట్‌గా మారనుంది.
ఇక మరోవైపు బాలకృష్ణ- కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్లో తెరకెక్కనున్న #NBK112 కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కొరటాల, బాలయ్య ఇమేజ్‌కు తగ్గ శక్తివంతమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌ను బాలయ్య పుట్టినరోజునే వెల్లడించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒకే రోజు రెండు సినిమాల నుంచి అప్డేట్లు రానుండటంతో అభిమానులు ఈసారి బాలయ్య బర్త్‌డేను భారీ స్థాయిలో సెలబ్రేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.







