బరువు తగ్గాలని ప్రయత్నించే వారిలో ఇప్పుడు చియా గింజలు, సబ్జా గింజలపై ఆసక్తి పెరుగుతోంది. ఈ రెండు గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తూ వెయిట్ లాస్‌లో సహాయపడతాయి.
చియా గింజల్లో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి.
సబ్జా గింజలు శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. వేసవిలో వీటిని తీసుకుంటే శరీరం తేలికగా అనిపిస్తుంది.
ఈ రెండు గింజల్లో కరిగే పీచు పదార్థం ఉండటం వల్ల ఆకలి త్వరగా వేయదు. దీంతో ఎక్కువగా తినే అలవాటు తగ్గుతుంది.
చియా గింజలు జీర్ణక్రియను నెమ్మదిగా చేసి శరీరానికి నిలకడైన శక్తిని అందిస్తాయి. వ్యాయామం చేసే వారికి ఇవి మంచి ఎంపికగా భావిస్తారు.
సబ్జా గింజలు జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడతాయి. కడుపు ఉబ్బరం తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి.
చియా గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి తీసుకోవడం మంచిది. సబ్జా గింజలను కనీసం 15 నిమిషాలు నానబెట్టాలి.
పచ్చిగా ఈ గింజలను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. సరైన విధంగా తీసుకుంటేనే పూర్తి ప్రయోజనాలు అందుతాయి.
మీ శరీరతత్వం,ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చియా లేదా సబ్జా గింజలను డైట్‌లో చేర్చుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలితో కలిసి ఇవి బరువు నియంత్రణలో సహాయపడతాయి.