జూన్ 19, 20 తేదీల్లో మాటా రెండో మహాసభలు.. ముఖ్య అతిథిగా హీరో నిఖిల్ సిద్ధార్థ్
MATA: మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “మాటా 2వ కన్వెన్షన్ ’26” (MATA 2nd Convention ’26) మహాసభలకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. 2026 జూన్ 19 , జూన్ 20 తేదీలలో పెన్సిల్వేనియాలోని ‘ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్’ వేదికగా ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ మహాసభలకు టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ‘గెస్ట్ ఆఫ్ హానర్’ (ముఖ్య అతిథి) గా హాజరుకానున్నారు.
నిర్వాహకులు..
ఈ మెగా ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు మాటా (MATA) నిర్వాహక కమిటీ సభ్యులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
- రమణ కిరణ్ దుద్దగి (ప్రెసిడెంట్)
- శ్రీధర్ గుడాల (కన్వీనర్)
- టోనీ జన్ను (కో-కన్వీనర్)
- దాము గేదెల (కో-కన్వీనర్)
- ప్రవీణ్ గూడూరు (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్)
- విజయ్ భాస్కర్ కలాల్ (సెక్రటరీ)
సంస్కృతి, సమాజం, వినోదం , తెలుగు మూలాలను ప్రతిబింబించేలా సాగే మహాసభలు ఈ రెండు రోజుల వేడుకలలో దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సర్ట్, రామ్ మిరియాల లైవ్ పర్ఫార్మెన్స్, భద్రాచల సీతారామ కల్యాణం వంటి విశేష కార్యక్రమాలు కూడా భాగం కానున్నాయి. ఈ మెగా ఈవెంట్‌కు ఎక్స్‌పాట్ మనీ , ఎమ్ఎస్ఎన్ఓ రియల్టీ సంస్థలు మెగా స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ప్రవాస తెలుగు వారందరూ ఈ మహాసభలలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి







