ఆయన కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదు? : భూమిరెడ్డి
కడపలో సొంత పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి (Pedda Dastagiri) హత్యకు గురైతే మూడు రోజులుగా పులివెందులలోనే ఉన్న జగన్ (Jagan) ఆయన కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (Bhumireddy Ramgopal Reddy) ప్రశ్నించారు. ఈ హత్యను గంజాయి బ్యాచ్ గొడవగా, అనుమానాస్పద మృతి గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద దస్తగిరి పేరుతో రూ.వందల కోట్ల భూ దందాలు, బినామీ ఆస్తులు పెట్టారని ఆరోపించారు. ఫ్యాక్టరీలు, గనులు లేని మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి (Ravindranath Reddy)కి రూ.వేల కోట్ల ఆస్తులు ఎక్కడివన్ని ప్రశ్నించారు. పెద్ద దస్తగిరి హత్యకు కారణమైన వారే ఇప్పుడు పరామర్శల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 2019`24లో ఒక్క ఆయకట్టకు అయినా జగన్ నీరు ఇచ్చినట్టు చూపిస్తే తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్దమని సవాల్ చేశారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});







