MLC Bhumireddy : ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు : ఎమ్మెల్సీ భూమిరెడ్డి

పులివెందులలో మెడికల్ కళాశాల (Medical College) భవన నిర్మాణాలను పూర్తి చేయకుండానే కళాశాల ప్రారంభించాలని వైఎస్ జగన్ (YS Jagan) ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (Bhumireddy Ramgopal Reddy) అన్నారు. ఆయన కళాశాలను పరిశీలించి మాట్లాడారు. 50 శాతం కూడా భవనాలు పూర్తి కాలేదన్నారు. భవనాలు లేకుండా, పిల్లలకు హాస్టల్ (Hostel) , సిబ్బందికి వసతి లేకుండా ప్రారంభించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రోడ్డుకు ఎదురుగా రెండు భవనాలను కట్టి ఇదే మెడికల్ కళాశాల అని ప్రజలను జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారు. కళాశాల పెండిరగ్ బకాయిలు రూ.40 కోట్లు మా ప్రభుత్వం చెల్లించింది. పీపీపీ (PPP) మోడల్‌లో కాలేజీలను నిర్వహిస్తామంటే జగన్‌కు బాధ ఎందుకు? ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు అని అన్నారు.