దేశానికే ఆదర్శంగా ఫ్యూచర్ సిటీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ (Future City) దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy), శ్రీధర్ బాబు (Sridhar Babu) పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) కార్యాలయ భవనం, స్కిల్ యÖనివర్సిటీ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్ సిటీని అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తోందన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్రంగా స్కిల్ యÖనివర్సిటీ నిలవబోతోందని చెప్పారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ద్వారా నగర అభివృద్ధి పనులకు మరింత వేగంగా చేకూరుతుందని పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఇవి కూడా చదవండి







