ఈసారి మీకు ఆ ఛాన్స్ ఇవ్వం : అచ్చెన్నాయుడు
జగన్ (Jagan) హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ఉన్నవాటినీ వెళ్లగొట్టారని విమర్శించారు. ఏ రాష్ట్రానికైనా పరిశ్రమల ద్వారానే ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని పేదల సంక్షేమానికి ఖర్చు చేయొచ్చు. రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ సీఎం చంద్రబాబు (Chandrababu). 24 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. అమరావతి (Amaravati) నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టాం. 2014`19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధి, సంక్షేమం గతంలో ఎప్పుడూ జరగలేదు. కానీ మనం చేసింది. చెప్పుకోలేదు. వైసీపీ అuద్ధాలను ప్రజలు నమ్మడంతో 2019లో మనకు నష్టం జరిగింది. జగన్ ఈసారి మీకు ఆ ఛాన్స్ ఇవ్వం. చేసిన పనులు ప్రజలకు చెప్పి, వారిని చైతన్యపరిచి ఈ రాష్ట్రంలో వైసీపీను పాతాళానికి పాతిపెడతాం అని అన్నారు.
ఇవి కూడా చదవండి







