తెలంగాణలో విస్తరిస్తున్న వి-గార్డ్ ‘సీఎస్ఆర్’ సేవలు.. విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
V-Guard: ప్రముఖ పారిశ్రామిక సంస్థ వి-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, తెలంగాణలో తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) పరిధిని మరింత విస్తరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో విద్య, నైపుణ్యాభివృద్ధి, వైద్య మౌలిక సదుపాయాల లక్ష్యంగా పలు సేవా కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టింది. సమాజంలో ఉన్న కీలకమైన లోపాలను భర్తీ చేస్తూ, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ఈ ప్రాజెక్టులను రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
వెనుకబడిన వర్గాల వారికి..
ఈ సందర్భంగా వి-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ & వి-గార్డ్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రీనా మిథున్ చిట్టిలప్పిల్లి (Reenaa Mithun Chittilappilly) మాట్లాడుతూ.. “తెలంగాణలో ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి నాణ్యమైన చదువు, వైద్య సేవలను దగ్గర చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేస్తూ, ప్రజల ఎదుగుదలకు అవసరమైన వనరులు, అవకాశాలను కల్పించడం ద్వారా ప్రతి ప్రాజెక్టును అర్థవంతంగా తీర్చిదిద్దాం” అని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను, వసతులను సీఎస్ఆర్ పెంచేందుకు సంస్థ కట్టుబడి ఉందని తెలుపుతూ ప్రధానంగా రెండు ప్రాజెక్టులను అమలు చేసింది.
ప్రాజెక్ట్ నవదర్శన్..
రంగారెడ్డి, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లోని 10 ప్రత్యేక పాఠశాలల్లో ఉన్న 958 మంది దివ్యాంగులైన (ప్రత్యేక అవసరాలు గల) పిల్లలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా అండగా నిలిచింది. వారికి అవసరమైన థెరపీ (చికిత్సా సంరక్షణ), వృత్తి విద్యా శిక్షణ అందించడంతో పాటు ఆయా స్కూళ్లలో మౌలిక వసతులను మెరుగుపరిచింది.
పాఠశాలల అభివృద్ధి..
హైదరాబాద్లోని సుర్రమ్ మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్లో 3 కొత్త క్లాస్ రూమ్లను నిర్మించింది. దీనివల్ల 55 మంది విద్యార్థులకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణంలో చదువుకునే వెసులుబాటు లభించింది.
ఈఎస్ఐ డిస్పెన్సరీ నిర్మాణానికి ఆర్ధిక సాయం..
ప్రభుత్వ వైద్య మౌలిక సదుపాయాలను మరింత పటిష్టం చేసే క్రమంలో భాగంగా, హైదరాబాద్ చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ (ESI) డిస్పెన్సరీ నిర్మాణానికి వి-గార్డ్ ఆర్ధిక సహాయాన్ని అందించింది. పేద, మధ్యతరగతి వర్గాలకు తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చేపట్టిన ఈ లబ్ధిదాయక కార్యక్రమం ద్వారా సుమారు 10 వేల మందికి పైగా ప్రజలకు మేలు జరగనుంది.
ఇవి కూడా చదవండి







