జియో కస్టమర్లకు పండగే.. రూ. 200 లకే 15 ఓటీటీలు, 1000కిపైగా టీవీ ఛానెళ్లు..!
స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, వినోదానికి లోటే ఉండదు. కానీ ఓటీటీల (OTT) పుణ్యమా అని నెలనెలా సబ్స్క్రిప్షన్లకే వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఒక్కో యాప్‌కి వందల రూపాయలు కట్టలేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారి కోసమే టెలికాం దిగ్గజం ‘రిలయన్స్ జియో’ (Reliance Jio) అదిరిపోయే బంపరాఫర్ ప్రకటించింది. ఎంటర్టైన్మెంట్ ప్రియుల జేబుకు చిల్లు పడకుండా ఉండేందుకు ఏకంగా ‘ఓటీటీ పాస్’ (OTT Pass) పేరుతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వివరాలు తెలిస్తే ఎవరైనా వెంటనే రీఛార్జ్ చేసుకోవాల్సిందే!
రూ. 200 కే రూ. 1500 ప్రయోజనాలు!
మనం ఏదైనా ఒక ఓటీటీ యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే కనీసం రూ. 150 నుంచి రూ. 300 వరకు వెచ్చించక తప్పని పరిస్థితి. అలాంటిది జియో (Reliance Jio) ప్రకటించిన ఈ ‘ఓటీటీ పాస్’ ధర కేవలం రూ. 200 మాత్రమే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ ఒక్క రీఛార్జ్‌తో ఏకంగా రూ. 1500 విలువ చేసే ప్రయోజనాలను జియో తన కస్టమర్లకు ఉచితంగా అందిస్తోంది. 28 రోజుల వాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌తో ఏకంగా 15 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను పూర్తి ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికి తోడు స్ట్రీమింగ్ సమయంలో డేటా అయిపోతుందనే భయం లేకుండా 30జీబీ (30GB) హై-స్పీడ్ డేటాను కూడా జియో (Reliance Jio) అందిస్తుండటం విశేషం.
ఇవి కూడా చదవండి
వచ్చే ఓటీటీలు, లైవ్ ఛానెళ్లు ఇవే..
సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎక్కువగా చూసే వారిని టార్గెట్ చేస్తూనే జియో (Reliance Jio) ఈ ప్యాక్‌ను రూపొందించింది. ఈ రూ. 200 ప్లాన్‌లో లభించే ప్రముఖ ఓటీటీలు, లైవ్ టీవీ ఛానెళ్ల వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రముఖ ఓటీటీ యాప్స్: యూట్యూబ్ ప్రీమియం (యాడ్-ఫ్రీ వీడియోలు), అమెజాన్ ప్రైమ్ వీడియో (మొబైల్ ఎడిషన్), సరికొత్త జియోహాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, సన్ నెక్స్ట్, డిస్కవరీ ప్లస్, ఫ్యాన్‌కోడ్ వంటి టాప్ ప్లాట్‌ఫామ్‌లు ఇందులో ఉన్నాయి.
లైవ్ టీవీ వినోదం: ఓటీటీలే కాకుండా జియోటీవీ (JioTV) యాప్ ద్వారా ఏకంగా 1000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించింది.
నెట్‌వర్క్‌లు: జియోస్టార్, సోనీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ నెట్వర్క్, ఈటీవీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ వంటి పాపులర్ నెట్‌వర్క్‌ల ఛానెళ్లు ఇందులో అందుబాటులో ఉంటాయి.
రీఛార్జ్‌కు ఉన్న షరతులు!
ఈ ప్లాన్ అద్భుతంగా ఉన్నప్పటికీ, వినియోగదారులు రీఛార్జ్ చేసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. కాల్స్, ఎస్సెమ్మెస్ ఫ్రీ కాదు. ఇది కేవలం ఒక ‘డేటా యాడ్-ఆన్ ప్లాన్’ మాత్రమే. కాబట్టి ఇందులో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ గానీ, ఉచిత ఎస్సెమ్మెస్ (SMS) సదుపాయం గానీ లభించదు. మీ నంబర్‌పై ఇప్పటికే వాయిస్ కాలింగ్ ప్లాన్ ఉంటేనే, ఇది అదనంగా పనిచేస్తుంది. అలాగే ఈ (Reliance Jio) ప్యాకేజీలో వందలాది టీవీ ఛానెళ్లు ఉన్నప్పటికీ, క్రీడాభిమానులకు మాత్రం నిరాశే. లైవ్ క్రికెట్, ఇతర క్రీడలు ప్రసారమయ్యే స్పోర్ట్స్ ఛానెళ్లను ఈ ఆఫర్ నుంచి జియో మినహాయించింది. సినిమా, సీరియల్స్, వెబ్ సిరీస్ ప్రియులకు మాత్రం ఈ జియో ‘ఓటీటీ పాస్’ పండగ లాంటిదే. వేర్వేరు ఓటీటీలకు వేల రూపాయలు ఖర్చు పెట్టే బదులు, కేవలం రూ. 200 తో 28 రోజుల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ పొందడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని యూజర్లు అంటున్నారు.
ఇవి కూడా చదవండి







