ఏటీఎంలలో డబ్బులు డ్రా చేస్తున్నారా? మీకో బ్యాడ్ న్యూస్.. మళ్లీ ‘నో క్యాష్’ బోర్డులు!
నోట్ల రద్దు సమయంలో ఏటీఎంల (ATM Money) ముందు గంటల తరబడి క్యూలో నిల్చున్న రోజులు గుర్తున్నాయి కదా! ఇప్పుడు మళ్లీ దాదాపుగా అలాంటి గడ్డు పరిస్థితులే రాబోతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి బ్యాంకింగ్ వర్గాలు. సెమీ-అర్బన్, టైర్-2 నగరాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలలో త్వరలో భారీ స్థాయిలో నగదు కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఇందుకు కారణం.. ఏటీఎంలలో నగదు నింపే విధానంలో త్వరలో రాబోతున్న భారీ మార్పులే!
ఆకాశాన్నంటుతున్న ఖర్చులు..
ఏటీఎంలలో డబ్బులు (ATM Money) నింపే (క్యాష్ మేనేజ్మెంట్) ఏజెన్సీలకు ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది. 2026 మే నెలలో ఇంధన (పెట్రోల్/డీజిల్) ధరలు లీటరుకు సుమారు రూ. 7.50 మేర అమాంతం పెరగడంతో.. క్యాష్ వ్యాన్ల నిర్వహణ ఏజెన్సీలకు తలకు మించిన భారంగా మారింది. దీనికి తోడు వ్యాన్ డ్రైవర్లు, భద్రతా సిబ్బంది (సెక్యూరిటీ గార్డ్స్) వేతనాలు సైతం పెరగడంతో.. ఈ సంస్థల ఆపరేషనల్ ఖర్చులు ఏకంగా 15 నుంచి 20 శాతం వరకు పెరిగిపోయాయి.
ఒక్కసారి డబ్బులు నింపితే రూ. 5000 ఖర్చు!
ఈ నిర్వహణ ఖర్చుల లెక్కలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. మెట్రో నగరాల్లో ఒకసారి ఏటీఎంలో డబ్బులు (ATM Money) రీఫిల్ చేయడానికి ఏజెన్సీలకు రూ. 800 నుంచి రూ. 1,500 వరకు ఖర్చవుతోంది. అదే మారుమూల గ్రామీణ ప్రాంతాలకైతే సుదూర ప్రయాణం, రవాణా భారం పెరిగిపోయి ఈ ఖర్చు ఏకంగా రూ. 5,000 దాటుతోంది. ఈ భారీ భారాన్ని మోయలేక సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్, బ్రింక్స్ ఇండియా, ఎస్ఐఎస్ ప్రోసెగర్ వంటి అగ్రగామి క్యాష్ మేనేజ్మెంట్ సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
వారానికి 2-3 సార్లే రీఫిల్..
రోజువారీ నష్టాలను తగ్గించుకునేందుకు ఈ సంస్థలు ఇప్పుడు ఒక కఠిన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. తక్కువ రద్దీ ఉండే ఏటీఎంలలో (ATM Money) ఇకపై ప్రతిరోజూ క్యాష్ రీఫిల్ చేయకూడదని, వారానికి కేవలం 2 నుంచి 3 సార్లు మాత్రమే నగదు నింపాలని యోచిస్తున్నాయి. అదే జరిగితే ఆ ఏటీఎంలలో పెట్టిన డబ్బులు క్షణాల్లో ఖాళీ అయిపోయి.. సామాన్యుడు అత్యవసరానికి వెళ్లిన ప్రతిసారీ ‘నో క్యాష్’ బోర్డులే దర్శనమిస్తాయి.
తమకు చెల్లించే నిర్వహణ ఛార్జీలను వెంటనే పెంచాలని ఈ క్యాష్ మేనేజ్మెంట్ (ATM Money) ఏజెన్సీలు ప్రస్తుతం ‘ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్’ (IBA)తో తీవ్ర స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. ఒకవేళ బ్యాంకులు ఫీజులు పెంచడానికి అంగీకరించకపోతే మాత్రం.. తమ రీఫిల్ విధానాలను కచ్చితంగా మార్చుకుంటామని ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే జరిగితే దేశవ్యాప్తంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ఏటీఎంలలో డబ్బులు దొరక్క సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడటం ఖాయమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి







