కొత్త కారు కొంటున్నారా? కస్టమర్లకు ‘హ్యుందాయ్’ బిగ్ షాక్..!
సొంత కారు కొనుక్కోవాలని కలలు కంటున్న సామాన్యులకు, మధ్యతరగతి వర్గాలకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో కార్ల ధరల మోత మళ్లీ మొదలైంది. దేశంలోనే ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా‘ (Hyundai Cars) కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. తమ వాహనాల ధరలను భారీగా పెంచుతున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీల వేదికగా ప్రకటించింది.
పెంపు ఎంతంటే..
హ్యుందాయ్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. మీరు ఎంచుకునే మోడల్, వేరియంట్‌ను బట్టి కార్ల ధరలపై గరిష్టంగా రూ. 12,800 వరకు అదనపు భారం పడనుందని కంపెనీ స్పష్టం చేసింది. అంటే జూన్ 1 తర్వాత హ్యుందాయ్ (Hyundai Cars) షోరూమ్‌లో ఏ కారు కొన్నా మునుపటి కంటే ఎక్కువ ధర చెల్లించుకోవాల్సిందే.
ఇవి కూడా చదవండి
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఆటోమొబైల్ రంగాన్ని ఇన్పుట్ ఖర్చులు తీవ్రంగా వేధిస్తున్నాయి. ముడిసరుకుల ధరలు ఆకాశాన్ని తాకడం, తయారీ ఖర్చులు, రోజువారీ నిర్వహణ వ్యయాలు విపరీతంగా పెరిగిపోవడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని హ్యుందాయ్ (Hyundai Cars) వివరించింది. వాస్తవానికి పెరిగిన ఖర్చుల భారాన్ని ఒకేసారి కస్టమర్లపై మోపకుండా ఉండేందుకు సంస్థ అంతర్గతంగా అనేక పొదుపు చర్యలు తీసుకుందని, కానీ ఆ వ్యయాలను పూర్తిగా భరించలేక.. అందులో కొంత భాగాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలుదారులకు బదిలీ చేస్తున్నామని కంపెనీ వెల్లడించింది.
మారుతి బాటలోనే హ్యుందాయ్..
కార్ల ధరల పెంపు కేవలం హ్యుందాయ్కే (Hyundai Cars) పరిమితం కాలేదు. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ లీడర్ అయిన ‘మారుతీ సుజుకి’ (Maruti Suzuki) కూడా ఇటీవలే తమ కస్టమర్లకు ఇలాంటి షాకే ఇచ్చింది. జూన్ నెల నుంచి తమ కార్ల ధరలను ఏకంగా రూ. 30,000 వరకు పెంచుతున్నట్లు మారుతి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఇదే ఒక ట్రెండ్‌గా మారుతోంది. సాధారణంగా ఆటోమొబైల్ కంపెనీలు కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్) ప్రారంభంలో లేదా పండుగ సీజన్లలో కార్ల ధరలను సవరిస్తుంటాయి. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు కేవలం నెలల వ్యవధిలోనే ఇలా వరుసగా ధరలు పెంచుతుండటం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముడిసరుకుల ఖర్చులు ఇలాగే మండిపోతుంటే.. రాబోయే రోజుల్లో మిగతా ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇదే బాటలో పయనించి ధరల పెంపు ప్రకటనలు చేసే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి కారు (Hyundai Cars) కొనే ప్లాన్ ఉంటే వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవడం ఉత్తమం!
ఇవి కూడా చదవండి







