ఆయన ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నాం : మోదీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వెండితెర వేల్పు ఎన్టీఆర్ (NTR) 103వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ (Prime Minister Modi)ఘన నివాళులర్పించారు. మహనీయులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. పేదలకు, అణగారిన వర్గాలకు గౌరవాన్ని కల్పించే దిశగా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం ప్రజల మదిలో నేటికీ చిరస్థాయిగా నిలిచి ఉంది. చలనచిత్ర రంగంలో ఆయన సాధించిన విజయాలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయి. ఆయన జీవితం, ఆశయాలు ఎంతోమందికి అపారమైన స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి. ఎన్టీఆర్ ఆశయాలను సాకారం చేయడానికి నా మిత్రుడు చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్డీయే ప్రభుత్వం (NDA Government) కట్టుబడి ఉంది అని ప్రధాని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి







