ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలి: బల్మూరి వెంకట్
ప్రభుత్వ ఆస్తులు, సింగరేణి కార్యాలయాలు తగలబెట్టాలని పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ (Balka Suman) పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మండలిలో ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ (Balmoori Venkat) సూచించారు. సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బాల్క సుమన్ వంటి వ్యక్తులు సమాజంలో ఉండడం మంచిది కాదన్నారు. బాల్క సుమన్ ఓ సంఘ విద్రోహ శక్తిలా మాట్లాడాడని విమర్శించారు. ఆయనది మొదటి నుంచీ నేర ప్రవృత్తేనని, తన రాజకీయ ఎదుగుదల కోసం ఎంతో మంది జీవితాలను పణంగా పెట్టాడని ఆరోపించారు. కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) కు చిత్తశుద్ధి ఉంటే బాల్క సుమన్ ను వెంటనే అరెస్టు చేయాలన్నారు.
ఇవి కూడా చదవండి







