మహానాడు మొదటి రోజు .. టీడీపీకి రూ.12 కోట్ల విరాళాలు
తెలుగుదేశం పార్టీ మహానాడు (Mahanadu) తొలిరోజు విజయవంతంగా ముగిసింది. ప్రవేశపెట్టిన వివిధ తీర్మానాలపై 48 మంది నేతలు మాట్లాడారు. పార్టీకి తొలిరోజు సుమారు రూ.12కోట్ల విరాళాలు అందాయి. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy), ఎమ్మెల్యే ప్రశాంతి (Prashanthi) దంపతులు రూ.5 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఎంపీ సానా సతీష్ రూ.1.5 కోట్లు, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Srinivasulu Reddy), భాష్యం రామకృష్ణ (Bhashyam Ramakrishna) రూ.కోటి చొప్పున ఇచ్చారు.
ఇవి కూడా చదవండి







