వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధం : మంత్రి పొంగులేటి
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ఇళ్ల కంటే ఎక్కువ కడితేనే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. లేదంటే ఎమ్మెల్యే (MLA)గా కూడా పోటీ చేయనని పేర్కొన్నారు. మీకంటే ఎక్కువ ఇళ్లు నిర్మిస్తే, మీరు పోటీకి దూరంగా ఉంటారా? అంటూ కేటీఆర్ (KTR) ను పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు.హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు నిరూపించానా, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ సవాల్ పై మంత్రి పొంగులేటి స్పందించారు. మే 23వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ లోని మూడు కార్పొరేషన్ల పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర ఏళ్లలోనే రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇందిరమ్మ పాలన అంటే ఏమిటో గ్రామాల్లోకి వెళ్లి ఆ ఇళ్లు కట్టుకున్న కుటుంబాలను అడిగితే తెలుస్తుందని కేటీఆర్ కు ఆయన స్పష్టం చేశారు. ఫామ్ హౌస్ లలో ఉంటే ఏం తెలుస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. దాంతో మీరు ప్రత్యేకంగా రాజకీయ సన్యానం తీసుకోనక్కర్లేదంటూ కేటీఆర్ కు పొంగులేటి వ్యంగ్యంగా అన్నారు.
ఇవి కూడా చదవండి







