“సిగ్మా” జూలై 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘సిగ్మా’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా, టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. టీజర్ ఇప్పటికే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సినిమాపై అంచనాలను పెంచింది.
లైకా ప్రొడక్షన్స్ హెడ్ జి.కె.ఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ.. “జూలై 31న ‘సిగ్మా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉంది. సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులకు ఇది ఒక కొత్త సినీ అనుభూతిని అందిస్తుందని నమ్ముతున్నాం. దర్శకుడిగా తొలి చిత్రానికే జేసన్ సంజయ్ మంచి స్పష్టత, అంకితభావం, నమ్మకంతో పనిచేశారు. ఈ విజన్‌ను సాకారం చేయడానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో కష్టపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ‘సిగ్మా’ను తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అన్నారు.
దర్శకుడు జేసన్ సంజయ్ మాట్లాడుతూ.. “సిగ్మా నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ప్రయాణం. నా విజన్‌ను నమ్మి, ప్రతి దశలోనూ అండగా నిలిచిన లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి నటుడు, సాంకేతిక నిపుణుడు ఎంతో నిబద్ధతతో పనిచేశారు. వారందరికీ నా ధన్యవాదాలు. జూలై 31న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాం. త్వరలో మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ను పంచుకోబోతున్నాం” అన్నారు.
భారీ స్థాయిలో రూపొందిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. అలాగే రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. హరిహరసుతన్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా వ్యవహరిస్తున్నారు. చిత్ర ఆడియో హక్కులను సరేగమా సొంతం చేసుకోగా, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. త్వరలో ఆడియో లాంచ్, ట్రైలర్ లాంచ్‌కు సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడించనున్నారు.







