బండి భగీరథ్ .. ముగిసిన పోలీసు కస్టడీ విచారణ
పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) కు 3 రోజుల పోలీసు (Police) కస్టడీ విచారణ ముగిసింది. ఇవాళ్టితో 3 రోజుల పోలీస్ కస్టడీ గడువు ముగియడంతో విచారణ తర్వాత మల్కాజిగిరి కోర్టు (Malkajgiri Court)లో హాజరు పర్చారు. అనంతరం కోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలు (Charlapally Jail)కు తరలించారు. ప్రధానంగా బాధితురాలితో ఇన్ స్టాగ్రామ్, వాట్సప్, స్నాప్ చాట్ లలో చాటింగ్ లకు సంబంధించి కొన్ని ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. వాటి ఆధారంగానే భగీరథ్ ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి







