మరోసారి ఆ డైరెక్టర్ తో సూర్య
తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) కెరీర్లో మళ్లీ పాజిటివ్ ఫేజ్ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజైన కరుప్పు(Karuppu) మంచి సక్సెస్‌ను అందుకోవడంతో సూర్యకు భారీ ఊరట లభించింది. గత కొన్ని సంవత్సరాలుగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సూర్యకు ఈ సినిమా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన తన 47వ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఆవేశం ఫేమ్ జీతూ మాధవన్(Jithu Madhavan) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను సంక్రాంతి 2027 సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, సూర్య తన 48వ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. జై భీమ్(Jai Bhim)తో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ టీజె జ్ఞానవేల్(TJ Gnanavel) ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఫైనల్ నెరేషన్‌తో పూర్తిగా ఇంప్రెస్ అయిన సూర్య వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసిన వెంటనే సూర్య ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతారని సమాచారం. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2D ఎంటర్టైన్మెంట్ఈ సినిమాను నిర్మించనుంది.
మరోవైపు సూర్య నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath & sons) కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకేసారి తమిళం, తెలుగు మార్కెట్లపై ఫోకస్ పెట్టిన సూర్య వరుస ప్రాజెక్టులతో బిజీ అవ్వడం అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతోంది. 2027 వరకూ స్టార్ హీరో డేట్స్ పూర్తిగా లాక్ అయినట్టే కనిపిస్తున్నాయి.







