ఫిలడెల్ఫియాలో ఘనంగా ఆటా సాంస్కృతిక కార్యక్రమాలు
అమెరికన్ తెలుగు సంఘం (ఆటా) ఫిలడెల్ఫియా ప్రాంతీయ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఝుమ్మంది నాదం’, ‘సయ్యంది పాదం’, మరియు అందాలపోటీలకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ పోటీలు జూన్ 13, 2026 న పెన్సిల్వేనియాలోని వెస్ట్ చెస్టర్ లో గల స్టెట్సన్ మిడిల్ స్కూల్లో అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక తెలుగు కమ్యూనిటీలలోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఈ పోటీలు రాబోయే 19వ ఆటా కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ కు క్వాలిఫైయింగ్ రౌండ్లుగా ఉపయోగపడతాయి. ఈ జాతీయ స్థాయి మహాసభల ఫైనల్స్లో ఉత్తర అమెరికా అంతటా ఎంపికైన విజేతలు తుది పోరులో తలపడనున్నారు.
ఈ స్థానిక పోటీలలో వివిధ విభాగాలలో 150 మందికి పైగా పోటీదారులు పాల్గొనగా, 10 మందికి పైగా ఉన్న ప్రముఖ న్యాయనిర్ణేతల (జడ్జీల) ప్యానెల్ వీరి ప్రతిభను అంచనా వేసింది. విజేతలు మరియు రన్నరప్లను ఎంపిక చేసింది. వారికి ఆటా ట్రోఫీలను అందించారు. నేషనల్ ఫైనల్స్లో వారు తమ స్థానాలను ఖాయం చేసుకున్నారు.
ఈ కార్యక్రమాలను అరుణ్ రుద్ర (రీజినల్ డైరెక్టర్), ముజీబిర్ రెహమాన్ (చైర్ – ఝుమ్మంది నాదం), శ్రావణి రుద్ర (లోకల్ కోఆర్డినేటర్), మరియు నీలవాణి కందుకూరి (ఉమెన్ కోఆర్డినేటర్) లు ముందుండి విజయవంతంగా నిర్వహించారు. ఆటా మాజీ అధ్యక్షుడు పరమేష్ భీంరెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ రాజు కాకర్లలు తగిన మార్గదర్శకత్వం, పర్యవేక్షణ అందించగా.. రీజినల్ కోఆర్డినేటర్లు ప్రమోద్ సంగని, వేణు బండి, మరియు వంశీ క్షేత్రస్థాయిలో విలువైన మద్దతును అందించారు. పోటీదారులు, వారి కుటుంబ సభ్యులు మరియు మద్దతుదారుల నుండి లభించిన భారీ స్పందన.. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో కమ్యూనిటీకి ఉన్న ఉత్సాహాన్ని, నిబద్ధతను ప్రతిబింబించింది. విజేతలు మరియు రన్నరప్లందరికీ ఆటా నాయకత్వం అభినందనలు తెలియజేసింది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనవిజయం సాధించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ, తల్లిదండ్రులు, గురువులు మరియు జడ్జీలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.








