MSG: మన శంకరవరప్రసాద్ గారు ఓటీటీలోకి ఎప్పుడంటే?
ఈ ఇయర్ సంక్రాంతికి పలు భారీ సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో ప్రభాస్(prabhas) రాజా సాబ్(the raja saab0 సినిమాకు తప్ప మిగిలిన సినిమాలన్నింటికీ ఆడియన్స్ నుంచి మంచి స్పందనే వచ్చింది. అయితే ఎన్ని సినిమాలు రిలీజైనా ఈ ఇయర్ విజేత మాత్రం చిరంజీవి(chiranjeevi)నే. అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన మన శంకరవరప్రసాద్ గారు(mana shankaravaraprasad Garu) ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైంది.
ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ప్రీమియర్ల నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. మంచి ఓపెనింగ్స్ తో పాటూ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను అందుకుంది ఈ సినిమా. సుమారు రూ.400 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. సినిమా రిలీజై మూడు వారాలైన నేపథ్యంలో దీని ఓటీటీ అప్డేట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 మన శంకరవరప్రసాద్ గారు డిజిటల్ రైట్స్ ను భారీ మొత్తానికి సొంతం చేసుకోగా, ఇప్పుడీ సినిమా జీ5లో త్వరలోనే స్ట్రీమింగ్ కు రానున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమా జీ5లోకి రానుందని, తెలుగుతో పాటూ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా అదేరోజున రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి ఈ మూవీ ఓటీటీలో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.






