Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా స్పోర్ట్స్-యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. మార్చి 27న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను వేసవి సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 30కి మార్చారు. ఈ అదనపు సమయంతో మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్స్‌కు సిద్ధమవుతున్నారు.
రిలీజ్ డేట్ పోస్టర్లో రామ్ చరణ్ మాస్ లుక్‌లో అదరగొట్టారు. పొడవైన జుట్టు, రగ్గడ్ గడ్డం, నోస్ రింగ్‌తో ఆయన లుక్ ఇంటెన్స్ గా కనిపిస్తోంది. ఆయన పదునైన చూపు నేరుగా గుండెల్లోకి దూసుకెళ్తుంది. చుట్టూ అలసిపోయిన, ముఖాల్లో వేదన కనిపించే జనసమూహం మధ్య నుంచి ఆయన రావడం ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.
ఈ చిత్రం ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్-లుక్ పోస్టర్లు, ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన చార్ట్‌బస్టర్ సింగిల్ ‘చికిరి చికిరి’ అన్ని ప్లాట్‌ఫామ్‌లలో అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. అనేక మైలురాళ్లను అధిగమించి, సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. చికిరి పాట 200 మిలియన్ల వ్యూస్ దాటి, అనేక రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది.
ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు డీవోపీ, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా తన అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్‌తో పెద్దికి అద్భుతమైన వరల్డ్ బిల్డింగ్ చేశారు.
‘పెద్ది’ చిత్రం అన్ని దక్షిణ భారత భాషలు, హిందీలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.






