Godari Gattupaina: గోదారి గట్టుపైన మూవీ నుంచి హార్ట్ బ్రేక్ యాంథమ్ ఓ మై గాడ్ ఫిబ్రవరి 14న రిలీజ్
మేమ్ ఫేమస్ తో స్ట్రాంగ్ డెబ్యు చేసిన న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ సినిమాతో అలరించబోతున్నారు. ఈ చిత్రం రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ కు ఫస్ట్ వెంచర్. MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
మేకర్స్ ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి హార్ట్ బ్రేక్ యాంథమ్ ఓ మై గాడ్ ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతున్నారు. వాలెంటైన్ డే సెలబ్రేషన్ కి ఇది పర్ఫెక్ట్ ట్రీట్ గా ఉండబోతుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ చిత్రానికి సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ, నాగ వంశీ కృష్ణ సంగీతం, ప్రొడక్షన్ డిజైనర్‌గా ప్రవాళ్య, ఎడిటర్‌గా అనిల్ కుమార్ పి పని చేస్తున్నారు.
యూత్‌ఫుల్ ఎనర్జీ, రూటెడ్ విజువల్స్, గోదారి గట్టుపైన స్నేహం, ప్రేమని సెలబ్రేట్ చేసుకునే ఫీల్-గుడ్ రూరల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ప్రేక్షకులని అలరించనుంది.













