రూ. 60 కోట్ల ట్యాగ్‌తో జైలర్2.. డీల్ క్లోజ్ అవుతుందా లేదా?
తమిళ, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించిన జైలర్(Jailer) తర్వాత, సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) – డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dilipkumar) కాంబినేషన్లో రూపొందుతున్న జైలర్2(Jailer2) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సీక్వెల్‌ను ఆగస్టు రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. సినిమా రిలీజ్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ క్లోజ్ అయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలుగు థియేట్రికల్ రైట్స్ విషయంలో మాత్రం భారీ ధర అడ్డంకిగా మారింది.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం జైలర్2 తెలుగు హక్కుల కోసం నిర్మాతలు సుమారు రూ.60 కోట్ల ధరను కోట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ భారీ రేటు కారణంగా ఇప్పటివరకు ఏ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ లేదా నిర్మాత ముందుకు రాలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో, తెలుగు మార్కెట్‌ను మరింత బలపరిచేందుకు సినిమాలో కీలక పాత్ర కోసం నందమూరి బాలకృష్ణను సంప్రదించినా, ఆయన ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్టు సమాచారం. దీంతో తెలుగు మార్కెట్లో సినిమా రీచ్ ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
ఇక ఫైనల్ డీల్ విషయానికి వస్తే, సినిమా మీద క్రియేట్ అయ్యే బజ్, రిలీజ్ డేట్ క్లారిటీ, అలాగే పేమెంట్ టర్మ్స్ వంటి అంశాలపై ఆధారపడి నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో జైలర్ సినిమాను దిల్ రాజు(Dil Raju), సురేష్ బాబు(Suresh Babu), ఏషియన్ సునీల్(Ashian Suneel) కలిసి కమిషన్ బేసిస్‌పై రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే మోడల్‌ను జైలర్2 కు కూడా అనుసరించే అవకాశం ఉందని టాక్. సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎలా డీల్ క్లోజ్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.







