షూటింగ్ పూర్తి చేసుకున్న జైలర్2
సూపర్‌స్టార్ రజినీకాంత్(rajinikanth) నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా జైలర్(Jailer) సక్సెస్ తో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, దాని సీక్వెల్‌గా తెరకెక్కుతున్న జైలర్2(Jailer2) షూటింగ్ పూర్తయింది. చిత్రబృందం ఇటీవలే చివరి రోజు షూటింగ్‌ను ఘనంగా పూర్తి చేసుకుని, సెట్స్‌పై సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dileep Kumar) తో పాటు రజనీకాంత్ పాల్గొనడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండగా, విడుదల తేదీపై త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భంగా ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో ప్రేక్షకులను అలరించిన రమ్య కృష్ణ(Ramya krishnan), యోగి బాబు(Yogi Babu), మిర్నా(Mirnaa) తమ పాత్రలను తిరిగి పోషించనున్నారు. ఇక విలన్ పాత్రలో SJ సూర్య(SJ Suryaah) కనిపించనున్నాడు. అదనంగా, శివ రాజ్‌కుమార్(Siva rajkumar), మోహన్ లాల్(Mohan lal) ప్రత్యేక పాత్రల్లో కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సినిమాను సన్ పిక్చర్స్(Sun pictures) నిర్మిస్తుండగా, సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) అందిస్తున్నారు. ఇప్పటికే నాన్ థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయిలో అమ్ముడైనట్లు సమాచారం. థియేట్రికల్ హక్కుల కోసం కూడా భారీ ధరను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్, మరియు మొదటి భాగం సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకుంటే, జైలర్2 పై అంచనాలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి.
ఇవి కూడా చదవండి







