వారణాసి లేటెస్ట్ షూటింగ్ అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి(Varanasi) షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఇండియా బయట పలు లొకేషన్లలో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్రబృందం, ఇప్పుడు హైదరాబాద్‌లోని కాటేదాన్ ప్రాంతంలో ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నారని, అందులో మహేష్ బాబు కూడా పాల్గొన్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజమౌళి సినిమాల్లో పాటలకు ఉండే విజువల్ గ్రాండియర్‌ను దృష్టిలో పెట్టుకుంటే, ఈ సాంగ్ కూడా సినిమాకే హైలైట్ అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్(Priyanka Chopra Jonas) హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే వీరి పాత్రలపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు- ప్రియాంకా చోప్రా కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుండగా, పృథ్వీరాజ్ పాత్ర కథలో కీలక మలుపులు తీసుకువస్తుందని టాక్ వినిపిస్తోంది. రాజమౌళి తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాను కూడా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని, యాక్షన్‌తో పాటు మైథాలజికల్ టచ్ కూడా ఇస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత కీరవాణి(Keeravani) సంగీతం అందిస్తున్నారు. రాజమౌళి- కీరవాణి కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఇప్పటికే ప్రత్యేకమైన అంచనాలున్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ సాంగ్‌కు కీరవాణి స్వరపరిచిన ట్యూన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న వారణాసిపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొనగా, షూటింగ్ అప్డేట్స్ ఒక్కోటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి







