జైలర్2 కు హక్కులకు భారీ రేటు
సూపర్‌స్టార్ రజినీకాంత్(rajinikanth) నటించిన జైలర్(Jailer) బ్లాక్‌బస్టర్ విజయంతో, దాని సీక్వెల్ జైలర్2(Jailer2)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్(nelson dileep kumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం ఆఖరి దశ షూటింగ్లో ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఆగస్టులో థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్లు, కాస్టింగ్ వివరాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇదిలా ఉండగా, జైలర్2 డిజిటల్ హక్కుల విషయంలో రికార్డు స్థాయి ఒప్పందం కుదిరింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాకు చెందిన అన్ని భాషల డిజిటల్ హక్కులను రూ.160 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఇది తమిళ సినిమాల చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక డిజిటల్ డీల్‌గా నిలిచింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, మొదటి భాగమైన జైలర్ కు డిజిటల్ హక్కులు రూ.75 కోట్లకు అమ్ముడవగా, సీక్వెల్‌కు దాదాపు రెండింతలు ధర రావడం విశేషం.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. నటీనటుల పరంగా కూడా సీక్వెల్లో భారీ లైనప్ కనిపిస్తోంది. రమ్యకృష్ణ(ramya krishna), యోగి బాబు(Yogi babu), మిర్నా(mirna) తమ పాత్రలను మళ్లీ పోషిస్తుండగా, విలన్ గా S. J. సూర్య కనిపించనున్నారు. ప్రత్యేక పాత్రల్లో శివరాజ్ కుమార్(Siva raj kumar), మోహన్ లాల్(Mohan lal) మెరిసే అవకాశం ఉంది. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్(Anirudh ravichander) అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి







