Jailer2: జైలర్2 టీమ్ కు మరో షాక్
సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా జైలర్2(Jailer2)పై ప్రస్తుతం ఆసక్తికరమైన అప్డేట్లు బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో కీలకమైన పోలీస్ పాత్ర కోసం మేకర్స్ టాప్ స్టార్‌ను తీసుకురావాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna)ను సంప్రదించగా, ఆయన ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్(Shah rukh khan) తో చర్చలు జరిగాయి. అయితే చివరి నిమిషంలో ఆయన కూడా ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పడంతో షూటింగ్ షెడ్యూల్ కొంత మేరకు డిస్టర్బ్ అయిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
తదుపరి దశలో ఈ కీలక పాత్ర కోసం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. కొంతకాలం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం, ఆయన ఈ ఆఫర్‌ను వినయంగా తిరస్కరించినట్టు స్పష్టమైంది. ప్రస్తుతం ఆయన రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాకు డేట్స్ ఇవ్వలేకపోయారని తెలిసింది. దీంతో ఈ పోలీస్ పాత్రకు ఎవరు ఫైనల్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక జైలర్2(jailer2) ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్(nelson dileep kumar) ఈ సీక్వెల్‌ను మరింత స్టైలిష్‌గా, భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని టాక్. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్(Sun pictures) ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా క్యామియో రోల్ చుట్టూ నెలకొన్న ఆసక్తితో మరింత హైప్‌ను సొంతం చేసుకుంటోంది.







