జీటీఏ అట్లాంటా నూతన కార్యవర్గ కమిటీ ప్రకటన
GTA: గ్లోబల్ తెలంగాణ సంఘం (GTA) తమ సంస్థకు సంబంధించిన నూతన గ్లోబల్ లీడర్షిప్ , ‘GTA అట్లాంటా’ ప్రాంతీయ కార్యవర్గ కమిటీ (Executive Committee), అడ్వైజరీ బోర్డు వివరాలను అధికారికంగా ప్రకటించింది. ప్రవాస తెలంగాణ సమాజ శ్రేయస్సు, సంస్కృతి పరిరక్షణే ధ్యేయంగా ఈ కమిటీలను ఏర్పాటు చేశారు.
గ్లోబల్ కమిటీ ప్రతినిధులు..
- ఫౌండర్ & అడ్వైజరీ చైర్: విశ్వేశ్వర్ కలవల
- చైర్మన్: ప్రవీణ్ కేసిరెడ్డి
- ప్రెసిడెంట్: బాపురెడ్డి కేతిరెడ్డి
- ప్రెసిడెంట్ ఎలెక్ట్: రవీందర్ గద్దంపల్లి
- వైస్ ప్రెసిడెంట్: డా. నందిని సుంకిరెడ్డి
- బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు: రాజేందర్ జనంపల్లి, అరుణ్ కత్పల్లి
GTA అట్లాంటా ఎగ్జిక్యూటివ్ కమిటీ ..
అట్లాంటా చాప్టర్ అధ్యక్షుడిగా (President) సంతోష్ ఆర్. గద్దం బాధ్యతలు స్వీకరించగా, ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా చంద్ర సుబ్బగారి ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా రమాకాంత్ అన్నాడి, కశ్యప్ రావు తంగడ, జనరల్ సెక్రటరీగా అరుణ్ దర్పల్లి, ట్రెజరర్‌గా రోహిత్ చేప్యాల, జాయింట్ ట్రెజరర్‌గా పల్లవి శివ, జాయింట్ సెక్రటరీగా రమ్య పుట్చా నియమితులయ్యారు.
వీరితో పాటు వివిధ కమిటీల బాధ్యులుగా అనంత్ జోషి (అట్లాంటా టీమ్ కోఆర్డినేటర్), అభినయ్ గట్లతో పాటు ప్రణీత్ కుమార్ మదాస్, విక్రమ్ అల్లాల, శ్రీనివాస్ బుర్రా, శ్రీనివాస్ దుర్గం, నరేందర్ నల్లా, వెంకట్ నరేష్ మల్లూరు, రమ్య కామరాజుగడ్డ, దామోదర్ గజెల్లి, మల్లికార్జున్ దేపెట, బిండియా రమేష్, రాంబాబు కర్నాటి, గౌరీ శంకర్. వి, శిల్ప సరుపు, ప్రసాద్ కాసినాధుని, కళ్యాణ్ ఎర్రనాగు, రోహిత్ మండల, సంకేత్ దివ్వెద, ప్రశాంతి ఓగెటి వివిధ విభాగాలకు చైర్లుగా, కో-చైర్లుగా ఎంపికయ్యారు.
GTA అట్లాంటా అడ్వైజరీ బోర్డ్ & కోర్ టీమ్..
అట్లాంటా అడ్వైజరీ బోర్డులో స్వప్న కస్వ (నేషనల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ 2023-25), అరవింద్ కట్టా (ప్రెసిడెంట్ 2025), సంతోష్ రెడ్డిమల్లి (వైస్ ప్రెసిడెంట్ 2025), అపర్ణ పింగ్లే (ప్రెసిడెంట్ 2024), కరుణాకర్ కేసిరెడ్డి (ప్రెసిడెంట్ 2023) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు సంస్థ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఒక భారీ కోర్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
సంస్థకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.globaltelangana.org అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని జీటీఏ ప్రతినిధులు తెలిపారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గానికి ప్రవాస తెలుగు సమాజం శుభాకాంక్షలు తెలియజేసింది.







