జూన్ 2న జనసేన పార్టీ కీలక సమావేశం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హైదరాబాద్ లో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, అభిమానులు (Fans) భారీగా హాజరవుతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ భేటీలో తెలంగాణ (Telangana)లో తాజా రాజకీయ పరిణామాల గురించి కొన్ని కీలక అంశాలను పవన్ కల్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో జనసేన భవిష్యత్తు కార్యాచరణ పైనా దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి.







