టీటీడీకి నీరా ఇండియా భారీ విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి భారీ విరాళం అందింది. ఒక విద్యుత్ బస్సు (Electric Bus)తో పాటు వైకుంఠ క్యూ కాంప్లెక్సు ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ కు ఉపయోపగడే 15 యాపిల్ ట్యాబ్ (Apple Tablet) లను నీరా ఇండియా (Neera India) అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట విద్యుత్ బస్సుకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం బస్సు తాళం, ట్యాబ్ లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (B.R. Naidu), అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkayya Chowdary)కి దాత అందించారు.
అనంతరం చైర్మన్, ఇతర అధికారులు బస్సులో ప్రయాణించి బస్సు సామర్థ్యాన్ని పరీక్షించారు. టీటీడీలో మొత్తం 20 ధర్మరథం బస్సులు ఉంటే, వాటిలో 14 విద్యుత్ బస్సులు ఉన్నాయని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ధర్మరథం బస్సులు 380 ట్రిప్పుల ద్వారా 21 బస్ స్టాప్‌లలో భక్తులకు సేవలందిస్తున్నాయని తెలిపారు.







