రాహుల్ గాంధీతో స్పీకర్ ప్రసాద్ కుమార్ భేటీ
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తో భేటీ అయ్యారు.త్వరలో మంత్రివర్గ్గ విస్తరణ చేపడతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రసాద్ కుమార్ అధిష్ఠానం నుంచి పిలుపు రావడం, ఆయన రాహుల్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఢిల్లీ (Delhi) వెళ్లిన ప్రసాద్ కుమార్ అక్కడ రాహుల్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు వివిధ అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే ప్రసాద్ కుమార్ తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని రాహుల్ ను కోరినట్లు తెలిసింది. తాను ఏ పరిస్థితుల్లో క్యాబినెట్ (Cabinet) లో అవకాశం కోరుకుంటున్నాననేది ఈ సందర్భంగా రాహుల్ కు వివరించినట్లు సమాచారం.







