జూన్ 26న శాన్ హోసేలో రాక్‌స్టార్ డీఎస్పీ లైవ్ ఇన్ కాన్సెర్ట్
BATA: బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) , బే ఏరియా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త సమర్పణలో టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) మ్యూజికల్ కాన్సెర్ట్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జూన్ 26, 2026 (శుక్రవారం) రాత్రి కాలిఫోర్నియాలోని శాన్ హోసే సివిక్ ఆడిటోరియంలో ఈ భారీ లైవ్ కాన్సెర్ట్ నిర్వహించనున్నారు.
“ది మ్యూజిక్.. ది మాస్.. ది మ్యాజిక్” అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ ప్రదర్శనలో డీఎస్పీ తన అద్భుతమైన పాటలు, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. ఈ ఈవెంట్‌కు నాగరాజ్ అన్నయ్య (Nagaraj Annaiah) ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తుండగా, సౌజన్య అనుబోతు (Soujanya Anubotu) ప్లాటినం స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు.
కార్యక్రమ వివరాలు..
తేదీ: జూన్ 26, 2026 (శుక్రవారం)
సమయం: రాత్రి 7:00 గంటలకు గేట్లు తెరుచుకుంటాయి (Doors Open), రాత్రి 8:00 గంటలకు షో ప్రారంభమవుతుంది (Show Starts).
వేదిక: శాన్ హోసే సివిక్, 135 W శాన్ కార్లోస్ స్ట్రీట్, శాన్ హోసే, CA 95113 (San Jose Civic, 135 W San Carlos St, San Jose, CA 95113)
ఈ సంగీత విభావరి టికెట్ల కోసం www.bata.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని, ఇతర సమాచారం కోసం 510-421-3535 లేదా 650-776-1203 నంబర్లను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.







