శృతి హాసన్ కెరీర్‌కు కొత్త మలుపు!
హీరోయిన్ గా సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శృతి హాసన్(Shruti haasan) ఇప్పుడు విభిన్న పాత్రలపై దృష్టి సారిస్తుంది. దుల్కర్ సల్మాన్(Dulquer salman) హీరోగా పవన్ సాధినేని(pavan sadhineni) దర్శకత్వంలో తెరకెక్కిన ఆకాశంలో ఒక తార(aakasam lo oka taara) సినిమాలో ఆమె పోషించిన స్పెషల్ రోల్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎమోషనల్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా మొదట నెమ్మదిగా స్టార్ట్ అయినప్పటికీ, పాజిటివ్ మౌత్‌టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది.
ఈ సినిమాలో శృతి హాసన్ తన నేచురల్ యాక్టింగ్ తో ఆడియన్స్ తో పాటు సినీ విమర్శకుల ప్రశంసలనూ అందుకుంటుంది. ముఖ్యంగా కథానుగుణంగా ఆమె పలికించిన భావోద్వేగాలు పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ నేపథ్యంలో శృతికి వరుసగా విభిన్నమైన పాత్రలకు సంబంధించిన అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు డైరెక్టర్లు ఆమెను సంప్రదించగా, యాక్టింగ్ ఓరియెంటెడ్ స్టోరీలను సెలక్ట్ చేసుకునే పనిలో శృతి ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
కొంతకాలంగా హీరోయిన్ క్యారెక్టర్లకు దూరంగా ఉంటున్న శృతి హాసన్, నటిగా తనలోని కొత్త కోణాలను ఆవిష్కరించే పాత్రలకు ప్రాధాన్యమిస్తున్నారు. పాత్ర నిడివి కంటే కథలో దానికున్న ప్రాముఖ్యతకే పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. సాత్విక వీరవల్లి(Satvika veeravalli) హీరోయిన్ గా నటించిన ఆకాశంలో ఒక తార శృతి కెరీర్‌కు కొత్త దిశను చూపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె నెక్ట్స్ మూవీస్ సెలెక్షన్ పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే తన కొత్త ప్రాజెక్టులను అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.







