వృషకర్మ సరికొత్త అనుభూతినిస్తుంది: మీనాక్షి చౌదరి
అక్కినేని నాగచైతన్య(Akkineni nagachaitanya) హీరోగా కార్తీక్ దండు(Karthik dandu) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సినిమా వృషకర్మ. బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad), సుకుమార్ రైటింగ్స్(Sukumar writings) నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) మీడియాతో ముచ్చటిస్తూ సినిమాకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
ఈ సినిమాలో పురావస్తు శాస్త్రంపై పరిశోధన చేసే దక్ష అనే యువతి క్యారెక్టర్ లో నటించినట్లు మీనాక్షి తెలిపారు. లక్ష్యంపై క్లారిటీతో ముందుకు సాగే పాత్ర తనదని పేర్కొన్నారు. షూటింగ్ కు ముందే నాగచైతన్యతో కలిసి రెండు రోజుల వర్క్‌షాప్‌లో పాల్గొన్నామని, డైరెక్టర్ ఆలోచనలను అర్థం చేసుకోవడానికి అది ఎంతగానో ఉపయోగపడిందని చెప్పారు. నాగచైతన్య ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారని, ఆయనతో కలిసి పనిచేయడం ఆనందాన్నిచ్చిందని వెల్లడించారు.
ఎత్తైన ప్రదేశాలంటే తనకు భయమున్నప్పటికీ, ఈ సినిమా కోసం ఛాలెంజ్ తో కూడిన సీన్స్ లో నటించినట్లు మీనాక్షి తెలిపారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన సీన్స్ ను స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రాచీన రహస్యాలు, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే ఈ స్టోరీ ఆడియన్స్ ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డైరెక్టర్ విజువలైజేషన్, అజనీష్ లోక్‌నాథ్(Ajaneesh loknath) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్స్ గా నిలవనున్నాయని, థియేటర్లలో వృషకర్మ సరికొత్త అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు.







