“ఇడుపు కాయితం” సినిమా మిమ్మల్ని ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది, థియేటర్స్ నుంచి హ్యాపీగా బయటకు వస్తారని గ్యారెంటీ ఇస్తున్నాం – ప్రొడ్యూసర్ బన్నీ వాస్
ప్రొడ్యూసర్స్ బన్నీ వాస్, తబిత సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా “ఇడుపు కాయితం”. ఈ సినిమాలో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా “ఇడుపు కాయితం” సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో “ఇడుపు కాయితం” సినిమా నుంచి ‘ఉల్లిపూల..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా
లిరిసిస్ట్ అభినయ శ్రీనివాస్ మాట్లాడుతూ – ఈ సినిమా కోసం నేను రాసిన గడప పాటను మీరంతా ఆదరించారు. ఉల్లిపూల పాట కూడా మీ ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ఇలాంటి మంచి ఫోక్ సాంగ్ రాసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్ అన్నీ హిట్ అవుతున్నాయి. సురేష్ బొబ్బిలి ప్రతి పాట అందంగా కంపోజ్ చేశారు. మా సినిమా మీద మంచి బజ్ ఉంది. “ఇడుపు కాయితం” సినిమా థియేటర్స్ లో మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.
నటుడు అభినవ్ గోమటం మాట్లాడుతూ – గోగులు గోగులు సాంగ్ ఇంకా పాడుకుంటూనే ఉన్నాం. ఆ లోగా ఉల్లిపూల సాంగ్ వచ్చేసింది. ఈ పాట కూడా గోగులు గోగులు సాంగ్ లాగే మంచి హిట్ అవుతుంది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఈ చిత్రానికి అసెట్ అవుతుంది. డిసెంబర్ 11న మనమంతా అమేజింగ్ మూవీ చూడబోతున్నాం. ప్రియదర్శి, నాగదుర్గ జోడీ చాలా బాగుంది. డిసెంబర్ లో వస్తున్న మంచి చిత్రాల్లో “ఇడుపు కాయితం” కూడా ఉంటుంది. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ – మా మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రతి పాటను హిట్ చేస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ సినిమాకు పనిచేయడం నాకెంతో ప్రత్యేకంగా భావిస్తా. ఉల్లిపూల పాట కంపోజ్ చేశాక ఒక కొత్త తరహా వాయిస్ కోసం చూస్తున్నప్పుడు హీనా గ్రేస్ ఒక ఫంక్షన్ లో పాడటం చూశాను. ఆ సోదరికి ఇది ఫస్ట్ పాట. ఆమె చాలా బాగా పాడారు. అభినయ శ్రీనివాస్ అన్న గడప సాంగ్, ఉల్లిపూల సాంగ్ అద్భుతంగా రాశారు. మా టీమ్ ను మీరంతా బ్లెస్ చేయాలని కోరుతున్నా. అన్నారు.
సింగర్ హీనా గ్రేస్ మాట్లాడుతూ – ఒక చిన్న షోలో పాడటం చూసి మా సురేష్ బొబ్బిలి అన్న నాకు ఈ మూవీలో పాట పాడే అవకాశం కల్పించారు. సినిమాలో పాడాను అనేది నమ్మలేకపోతున్నా. “ఇడుపు కాయితం” టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి మాట్లాడుతూ – మా మూవీ వర్క్ కంప్లీట్ అయ్యింది. డిసెంబర్ 11న మీ ముందుకు వస్తున్నాం. డిసెంబర్ లో ఒక లవ్ స్టోరీ, ఒక థ్రిల్లర్ సినిమా వస్తోంది. మాది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ బిజీ లైఫ్ లో మనం ఏ బంధాలను కోల్పోతున్నాం అనేది గుర్తుచేసే మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందించాను. అబ్బాయి, అమ్మాయి తరుపున ఉండే రెండు కుటుంబాలు కలిసి మా సినిమా చూస్తే వారి మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది. మా సినిమా చూశాక చెమర్చిన కళ్లతో, భావోద్వేగంతో బయటకు వస్తారు. అన్నారు
హీరోయిన్ నాగ దుర్గ మాట్లాడుతూ – మా సినిమాకు, మా టీమ్ కు మీరు ఇస్తున్నలవ్ అండ్ సపోర్ట్ కు చాలా థ్యాంక్స్. మా సినిమా నుంచి రిలీజ్ చేసిన శ్రీలత, గడప, బరాత్ సాంగ్ లను మీరు బాగా ఆదరిస్తున్నారు. ఈ పాట కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మేము ప్రమోషనల్ కంటెంట్ లో చూపించేది చాలా తక్కువ. మంచి కంటెంట్ డిసెంబర్ 11న మూవీలో చూడబోతున్నారు. మా సినిమా మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తుంది. సురేష్ బొబ్బిలి అన్న మ్యూజిక్ ను అభిమానిస్తాను. నేను చేసే సినిమాలో ఒక్క పాటైనా చాలా బాగుండాలని కోరుకున్నాను. అయితే ఒక పాటను మించి మరో హిట్ సాంగ్ ను సురేష్ బొబ్బిలి అన్న అందిస్తున్నారు. డిసెంబర్ 11న మా సినిమాను థియేటర్స్ లో చూడాలని కోరుతున్నా. అన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాట్లాడుతూ – మా మూవీ కంప్లీట్ అవుతోంది. ఫస్ట్ కాపీ రెడీ అవుతోంది. డిసెంబర్ 11న తప్పకుండా వస్తున్నాం. నేను సినిమా చూశాను నచ్చింది. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతంతో చూసినప్పుడు మూవీ ఇంకా బాగా నచ్చింది. కథ, సంగీతం బాగా కలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూశాను. ఇది బ్యూటిఫుల్ టీమ్. ఈ సినిమాకు ప్యాషనేట్ గా వర్క్ చేస్తున్న టీమ్ కోసం ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. “ఇడుపు కాయితం” అనేది సీరియస్ సబ్జెక్ట్ ఉన్న సినిమా అనుకుంటున్నారు కానీ మీకు కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. ప్రియదర్శి, నాగ దుర్గ ఒకరితొ మరొకరు పోటీ పడి పర్ ఫార్మ్ చేశారు. మా సినిమా 2 గంటల 41 నిమిషాలు మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. థియేటర్ నుంచి మీరు హ్యాపీగా బయటకు వెళ్తారు. ఇది మా గ్యారెంటీ. ఉల్లిపూల సాంగ్ కు శ్రీనివాస్ గారు మంచి లిరిక్స్ అందిస్తే, హీనా గ్రేస్ అద్భుతంగా పాడారు. అన్నారు.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ – ఉల్లిపూల సాంగ్ విన్నప్పుడు నాకు బాగా నచ్చింది. ఒక అమ్మాయి ప్రేమలో ఉంటే ఎంత బాగుంటుందో చెప్పే సాంగ్ ఇది. ఒక అమ్మాయి ప్రేమలో ఉన్నప్పుడు ఆమె చూసే ప్రపంచం కొత్తగా ప్రత్యేకంగా ఉంటుంది. 24 గంటలు ఆనందంగా కనిపిస్తారు. ఆ ఫీల్ ను మా శ్రీనివాస్ అన్న తన సాహిత్యంలో ప్రదర్శించారు. లిరికల్ వ్యాల్యూస్ ఉన్న పాట ఇది. పది పుస్తకాల్లో ఉండే తత్వాన్ని రెండు మూడు లైన్లలో రాశాడు శ్రీనివాస్ అన్న. మా సినిమాలో ప్రతి పాటను అందంగా కంపోజ్ చేశారు సురేష్ బొబ్బిలి అన్న. ఇంకో పాట కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. అది కూడా గొప్పగా ఉంది. బన్నీ వాస్ అన్న, తబిత అక్క ఈ సాంగ్స్ కోసం ఎంత తపన పడ్డారో తెలుసు. ఒక చేనేత నేపథ్య సినిమా చేసిన నటుడిగా ఉల్లిపూల చీరలో ఎన్ని నూలు పోగులు ఉంటాయో నాకు తెలుసు. అన్నే ఎమోషన్స్, సెంటిమెంట్స్ మీకు మా మూవీ ద్వారా అందించబోతున్నాం. అన్నారు.







