వారణాసిపై త్వరలోనే కీలక అప్డేట్!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) ప్రిస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న భారీ సినిమా వారణాసి(Varanasi) రిలీజ్‌పై సినీ వర్గాల్లో ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. మహేష్ బాబు(mahesh babu) హీరోగా నటిస్తున్న ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. షూటింగ్ పూర్తైనప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ భారీ స్థాయిలో పెండింగ్‌లో ఉండటంతో రిలీజ్ వాయిదా పడే అవకాశముందనే ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై మేకర్స్ ఇప్పటివరకు అఫీషియల్ గా రెస్పాండ్ అవలేదు.
తాజాగా ఆకాశంలో ఒక తార(Aakasam lo oka taara) సక్సెస్ మీట్‌కు చీఫ్ గెస్టుగా హాజరైన రాజమౌళికి వారణాసికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా త్వరలోనే సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో రాజమౌళి చేయబోయే అనౌన్స్‌మెంట్‌పై మహేష్ బాబు ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఇయర్ ముగిసేలోపే సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే రాజమౌళి రివీల్ చేయబోయేది రిలీజ్ డేట్‌కు సంబంధించిన విషయమా? లేక మరేదైనా స్పెషల్ అప్డేటా? అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఇవి కూడా చదవండి
పౌరాణిక అంశాలతో కూడిన భారీ యాక్షన్ మూవీగా రూపొందుతున్న వారణాసిలో ప్రియాంక చోప్రా(Priyanka chopra), పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj sukumaran) కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత కె.ఎల్. నారాయణ(KL Narayana) అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు. భారీ అంచనాలున్న ఈ సినిమా విషయంలో రాజమౌళి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో వేచి చూడాలి.







