స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగా సినిమా ఫిక్స్!
అర్జున్ రెడ్డి(Arjun reddy) తో డైరెక్టర్ గా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga).. కబీర్ సింగ్(Kabir singh), యానిమల్(Animal) సినిమాలతో బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ప్రభాస్(Prabhas) హీరోగా స్పిరిట్(Spirit) సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2027 అక్టోబర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే, ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా మహేష్ బాబు(Mahesh babu)తో లేదా మరో టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా తన నెక్ట్స్ మూవీ యానిమల్ పార్క్(Animal park) అని వెల్లడించి సందీప్ ఆ ఊహాగానాలకు తెరదించారు.
రణ్‌బీర్ కపూర్(Ranbir kapoor) హీరోగా తెరకెక్కనున్న యానిమల్ పార్క్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఇతర సినిమాల కమిట్మెంట్స్ కారణంగా స్పిరిట్ షూటింగ్ లో ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. దీంతో షూటింగ్ బ్రేక్ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటూ సందీప్ రెడ్డి వంగా యానిమల్ పార్క్ స్క్రిప్ట్ వర్క్స్ లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మరోవైపు రణ్‌బీర్ కపూర్ కూడా ఈ ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రస్తుత ప్లానింగ్స్ ప్రకారం 2028లో యానిమల్ పార్క్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. టీ సిరీస్(T series), భద్రకాళి పిక్చర్స్(Badrakali pictures) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. యానిమల్ తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన సందీప్, రణ్‌బీర్ కాంబినేషన్ మరోసారి ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి స్పిరిట్ పూర్తైన వెంటనే సందీప్ రెడ్డి వంగా మరోసారి బాలీవుడ్‌పై దృష్టి సారించనున్నారు.







