వృషకర్మ.. ఆఖరి 40 నిమిషాలు వేరే లెవల్!
అక్కినేని నాగచైతన్య(Akkineni naga chaitanya) హీరోగా కార్తీక్ దండు(Karthik dandu) దర్శకత్వంలో తెరకెక్కిన వృషకర్మ(Vrushakarma) డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు విశేష స్పందన లభించడంతో మేకర్స్ సక్సెస్‌పై ధీమా వ్యక్తం చేస్తోంది. తాజాగా నిర్వహించిన మీడియా ఈవెంట్ లో డైరెక్టర్, హీరో మూవీకి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. ఇండియన్ ఆడియన్స్ గర్వించేలా ఓ సినిమాను తీయాలనే టార్గెట్ తో ఈ జర్నీని స్టార్ట్ చేసినట్టు కార్తీక్ దండు(Karthik dandu) వెల్లడించారు.
హారర్ నేపథ్యంలో సరికొత్త కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో కథనం మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని డైరెక్టర్ తెలిపారు. విభిన్న కోణాల్లో సాగే కథ ఇంటర్వెల్‌కు ఒక కీలక మలుపు తీసుకుంటుందని, క్లైమాక్స్ సీన్స్ ఆడియన్స్ కు ఊహించని అనుభూతిని అందిస్తాయని పేర్కొన్నారు. వృషకర్మ థియేటర్లలోనే ఆస్వాదించాల్సిన సినిమా అని చెప్పారు.
ఇవి కూడా చదవండి
డైరెక్టర్ టాలెంట్‌పై పూర్తి నమ్మకంతో ఈ సినిమా చేశానని నాగచైతన్య తెలిపారు. తన క్యారెక్టర్ తో పాటు మీనాక్షి చౌదరి(Meenakshi chaudhary), జయరామ్(Jayaram), బేబీ కియారా(Kiara) పాత్రల మధ్య సాగే ఎమోషన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయని చెప్పారు. స్పర్శ్(Sparsh) యాక్టింగ్ ఆడియన్స్ ను భయపెడుతుందన్నారు. ముఖ్యంగా ఆఖరి 40 నిమిషాలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగు ఆడియన్స్ కు సరికొత్త సినీ అనుభూతిని అందించేందుకు చిత్రబృందమంతా ఎంతో శ్రమించిందని, ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ తమ నమ్మకాన్ని మరింత పెంచిందని నాగచైతన్య పేర్కొన్నారు.







