జపాన్‌లో ఇండియన్ సినిమాకు ఎందుకింత క్రేజ్?
భాష, సంస్కృతి పరంగా ఎన్నో తేడాలున్నప్పటికీ భారతీయ సినిమాలకు జపాన్‌లో విశేష ఆదరణ లభిస్తోంది. తాజాగా అక్కినేని అఖిల్‌కు అక్కడి ఫ్యాన్స్ నుంచి లభించిన అపూర్వ స్వాగతం మరోసారి ఈ విషయాన్ని డిస్కషన్ లోకి తీసుకొచ్చింది. డిసెంబర్ 11న లెనిన్(Lenin) సినిమాతో ఆడియన్స్ ముందుకు రానున్న అఖిల్(Akhil) ప్రస్తుతం తన భార్య జైనబ్ రవ్దీజీ(Zainab ravdeeji)తో కలిసి జపాన్‌లో విహరిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక అభిమానులు స్వయంగా గీసిన పెయింట్స్ ను అందజేస్తూ తమ అభిమానాన్ని చాటుకోవడం విశేషం.
ఇవి కూడా చదవండి
భారతీయ సినిమాల్లోని స్ట్రాంగ్ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్స్, స్నేహం, ప్రేమ, త్యాగం వంటి అంశాలు జపాన్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ యాక్షన్ సీన్స్, వైవిధ్యమైన సంగీతం, డ్యాన్సులు, హీరోయిజంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు కూడా వారిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇండియాలో ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించని కొన్ని సినిమాలకు సైతం జపాన్‌లో ఆదరణ లభించడం గమనార్హం.
1998లో రజనీకాంత్(Rajinikanth) నటించిన ముత్తు(mutthu) సినిమా జపాన్‌లో సెన్సేషనల్ సక్సెస్ సాధించడంతో భారతీయ సినిమాలకు అక్కడ స్పెషల్ మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్(RRR) ఈ బాండింగ్ ను మరింత బలోపేతం చేసింది. నాటు నాటు(Naatu naatu) సాంగ్‌కు జపాన్ ఆడియన్స్ థియేటర్లలోనే స్టెప్పులేయడం ఇండియన్ సినిమా ఇంపాక్ట్ కు నిదర్శనం. తాజాగా అఖిల్‌కు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే తెలుగు సినిమాలకు జపాన్‌లో మరింత విస్తృతమైన మార్కెట్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.







