దాదా రిలీజ్‌పై సందిగ్ధత!
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని(Gopichand malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దాదా(Dada). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. డిసెంబర్ 10లోగా షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. డిసెంబర్ 24న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసినప్పటికీ, కొత్త సెన్సార్ రూల్స్ నేపథ్యంలో అనుకున్న టైమ్ కు అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడం సవాల్‌గా మారనుంది.
మరోవైపు దాదాపై ఆడియన్స్ లో ఆశించిన స్థాయిలో హైప్ కనిపించడం లేదు. దీంతో భారీ ప్రమోషన్స్ కు మేకర్స్ ప్లాన్స్ ను రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. క్రిస్మస్ సందర్భంగా నాగార్జున(nagarjuna) కింగ్ 100(King100), షారుక్ ఖాన్(Shah rukh Khan) కింగ్ తో పాటు పలు హాలీవుడ్ సినిమాలు రిలీజ్ కు రెడీ అమవుతున్నాయి. ఆ వెంటనే సంక్రాంతి సినిమాల సందడి మొదలు కానుండటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టేందుకు దాదాకు లిమిటెడ్ టైమ్ మాత్రమే లభించనుంది.
ఇవి కూడా చదవండి
ఈ పరిణామాల నేపథ్యంలో మరో రిలీజ్ డేట్ ను కూడా నిర్మాతలు పరిశీలిస్తున్నట్లు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హడావుడిగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కంటే, తగినంత టైమ్ తీసుకుని ప్రమోషన్స్ ను ముమ్మరం చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్ పోస్ట్‌పోన్ పై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. వెంకట సతీష్ కిలారు(Venkata satish Kilaru) నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్(thaman) మ్యూజిక్ అందిస్తున్నారు. మరి క్రిస్మస్ బరిలో బాలయ్య నిలుస్తారా? లేక కొత్త రిలీజ్ డేట్ ను ఎంచుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.







