GRTA ఆధ్వర్యంలో ఘనంగా ‘‘లేడీస్ నైట్’’
గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ (GRTA) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లేడీస్ నైట్’ (Ladies Night) వేడుకలు అత్యంత ఉత్సాహంగా, ఘనవిజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా అనేకానేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక్కడికి విచ్చేసినవారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని ఎంజాయ్ చేశారు.
ఈ వేడుక విజయవంతం కావడానికి అనేక మంది సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమానికి నవసర టీ, వెజ్, నాన్ వెజ్ స్టార్టర్లతో పాటు రుచికరమైన చికెన్ బిర్యానీని కూడా అందించారు. అలాగే తావా వాళ్లు రుచికరమైన వెజ్ బిర్యానీ, నూడుల్స్, స్వీట్లను కూడా సమకూర్చారు. మరోవైపు నవరస, తావా, మార్కెట్ కేప్ విజేతలు, అతిథుల కోసం గిఫ్ట్ కార్డులను కూడా స్పాన్సర్ చేశారు.GRTA కమ్యూనిటీ పట్ల దాతలు చూపుతున్న నిరంతర ఆదరణ, ప్రోత్సాహం ఎంతో అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ సాయంత్రాన్ని ఇంత ప్రత్యేకంగా తీర్చిదిద్దడానికి సమష్టిగా కృషి చేసిన వాలంటీర్లు, కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న సభ్యులు మరియు కార్యవర్గ (EC) సభ్యులందరికీ GRTA 2026 అధ్యక్షులు జయపాల్ కాసర్ల మరియు టీమ్ GRTA 2026 తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.







